విభిన్నమైన ప్రేమ కథలో సమంత..

119
- Advertisement -

కార్తీ ఖైదీ, శర్వానంద్ ఒకే ఒక జీవితం వంటి చిత్రాలతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. ప్రొడక్షన్ నంబర్ 30గా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ క్వీన్ సమంత నటిస్తున్నారు. ఈ సినిమాతో శంతనురుబన్ జ్ఞానశేఖరన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇదొక విభిన్న ప్రేమ కథ చిత్రం. సమంత పక్కన నటించే హీరోను త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సమంతను చూస్తే ఎంతో బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత రచయితగా కనిపించబోతోన్నారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.

- Advertisement -