‘ఎఫ్ 3’ నుండి దసరా స్పెషల్ పోస్టర్ విడుదల..

155
- Advertisement -

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా రాబోతోన్న ఎఫ్ 3 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. థియేటర్లో నవ్వుల జల్లు కురిపించేలా ఈ సారి కామెడీ డోస్ పెంచుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎఫ్ 3 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా భాటియా, మెహరీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో సుధీర్ఘ షెడ్యూల్‌ను చిత్రయూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు నటీనటులందరూ పాల్గొంటున్నారు. దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు తమ తమ స్టైల్లో అదరగొట్టేశారు.

చిత్రయూనిట్ విడుదల చేసిన ఈ వీడియోలో అందరూ దసరా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ వీడియోను చూస్తుంటే సెట్‌లో ఎంతటి సందడి వాతావరణం ఉందో తెలుస్తోంది.రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు

సాంకేతిక బృందం
డైరెక్టర్ : అనిల్ రావిపూడి
సమర్పణ : దిల్ రాజు
నిర్మాత : శిరీష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్ : హర్షిత్ రెడ్డి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
కెమెరామెన్ : సాయి శ్రీరామ్
ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్ : తమ్మిరాజు
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే : ఆది నారాయణ, నారా ప్రవీణ్

- Advertisement -