సమంత ఫస్ట్ ప్రాజెక్టు.. రిలీజ్‌కు సిద్ధం!

2
- Advertisement -

హీరోయిన్ సమంత ఓ వైపు సినిమాలు మరోవైపు నిర్మాణ రంగంలోకి బిజీగా మారిపోయారు. సమంత నిర్మాతగా తెరకెక్కిన చిత్రం శుభం. తన సొంత నిర్మాణ సంస్థ .. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ ఆధ్వర్యంలో ‘శుభం’ తెరకెక్కింది.

ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కాగా త్వరలోనే రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కగా వసంత్ మరిగంటి రాసిన ఈ కథను సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు.

మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read:ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

- Advertisement -