సమంత ప్లానింగ్ అదుర్స్

250
samantha
- Advertisement -

అక్కినేని వారింట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత అందాల భామ సమంత ఎక్కువగా ట్రెడిషినల్ లుక్‌లోనే కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నా.. సెలక్టెడ్ కథలకే పచ్చజెండా ఊపుతోంది. గ్లామర్ ఆరబోతను పూర్తిగా పక్కనబెట్టి, వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యమివ్వడానికి సిద్ధమైనట్లు సంకేతాలు కూడా ఇచ్చింది. సమంత పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా సెలెక్టెడ్‌ పాత్రల్లోనే నటిస్తోంది. అటు మాస్‌ ప్రేక్షకులను, ఇటు క్లాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా పాత్రలను ఎన్నుకుంటూ సినిమాల్లో రాణిస్తోంది సమంత.

Samantha-Ruth-Prabhu

పక్కా ప్లానింగ్ తో ఆమె చేసిన సినిమాలు సమంతకు ఇద్దర్ని దగ్గర చేశాయి. కానీ ఈ పద్దతి ఇప్పటి హీరోయిన్లు పాటించలేకపోతున్నారు. రాశీ ఖన్నా… ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదా కోసం ప్రయత్నిస్తోంది. దాదాపు ఆ హోదాకు దగ్గర్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆమె నిర్ణయాలు తీసుకోవడంలో తడబడిపోతోంది.

samantha_

ఊహలు గుసగుసలాడే  సినిమాలో పక్కింటి పిల్లలా ఒద్దికగా కనిపించి… క్లాస్ జనాలకు చాలా నచ్చేసింది. ఆ తరువాత రవితేజ – ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆ సినిమాలేవీ ఆమెకు అంత మంచి పేరు తెచ్చిపెట్టలేదు. వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమ మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్ర వచ్చిందని… ఇకపై అలాంటి సినిమాలే చేయాలని నిర్ణయించుకుందట. అలాంటి పాత్రలే చేయాలని పట్టుబట్టుకుని కూర్చుంటే… కష్టమే అంటున్నారు సినీజనాలు.తెలివిగా… సమంతలా ప్లాన్ చేసుకుంటే సమస్యలే రావంటున్నారు. చూడాలి మరి రాశీఖన్నా ఎటువంటి పాత్రలకు ప్రాధాన్యమిస్తుందో..

- Advertisement -