విడాకులపై మరోసారి సమంత షాకింగ్‌ కామెంట్స్‌..!

88
- Advertisement -

టాలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ అండ్ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ ఎవరంటే.. సమంతా అనే సంగతి అందరికీ తెలిసిందే. 2010లో వచ్చిన ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో సమంత, నాగచైతన్య కలిసి నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న తర్వాత ఏం జరిగిందో కానీ… ఇద్దరూ అందరికీ షాకిస్తూ విడిపోయారు.

ఈ బ్యూటిఫుల్ కపుల్‌ విడిపోతున్న వార్తతో సినీ అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే సమంత చైతూతో విడిపోయిన నాటి నుండి తన సోషల్‌ మీడియాలో పలు ఆసక్తికరమైన పోస్టులు పెడుతోంది. తాజాగా సమంత తన విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తాను అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపింది.

2021లో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల తర్వాత తన జీవితంలో ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయని… ఎందుకంటే తాను ఎంతో జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలన్నీ శిథిలమైపోయాయని.. భవిష్యత్తులో తనకు ఏదైతే సురక్షితంగా అనిపిస్తుందో దాన్ని స్వీకరిస్తానని చెప్పుకొచ్చింది.

- Advertisement -