రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.సినిమా షూటింగ్ ప్రారంభమై 10 రోజులు అయింది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ కాగా.. ఇప్పటికే ఓ పాట షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న ఒకట్రెండు రోజులకే ఈ సినిమాపై కొత్త రూమర్ వచ్చేసింది.
చరణ్ ఈ సినిమాలో వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుంటే.. సమంత ఓ మూగ అమ్మాయి పాత్ర పోషిస్తోందనే టాక్ వచ్చింది. కొందరైతే అంధురాలి రోల్ కూడా అనేశారు. కానీ ఇప్పుడు స్యామ్ టీమ్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సుక్కు-చెర్రీల మూవీలో సమంత ఎలాంటి అంగ లోపం ఉన్న పాత్ర చేయడం లేదట. ఈమె పోషిస్తున్న పాత్ర ఓ రిచ్ విలేజ్ గాళ్ అని చెబుతున్నారు. మూగ రోల్ అంటూ వస్తున్న వార్తలను ఖండించేశారు. గ్రామీణ నేపథ్యంతో సాగే పక్కా కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు యూనిట్.
చరణ్ సినిమాలో సమంత పాత్ర చాలా ఆకట్టుకునేలా ఉంటుందని.. ఇంతగా పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉండే రోల్ చేసే అవకాశం కెరీర్ లో ఒక్కసారి మాత్రమే వస్తుందని అంతటి ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రంతో పాటు నాగ్ నటిస్తున్న రాజుగారి గది2 సావిత్రి బయోపిక్ మహానటి చిత్రాలలో కూడా సమంత కీలక పాత్రలు పోషిస్తోంది.