ఆ సమయంలో అందాలు ఆరబోశా..!

132
Lavanya Tripati Ready For Glamorou Roles

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచమై వరుసగా హ్యాపెనింగ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ”మిష్టర్” సినిమాతో దూసుకొస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా సాంప్రదాయబద్దం ఓణి పరికిణీ లుక్ లోనే కనిపిస్తన్నారేంటి అంటే.. అసలు నేను మోడలింగ్ చేసినప్పుడు నా కెరియర్లో ఒక్కసారి కూడా కనీసం సాల్వార్ కమీజ్ వేసుకునే షూట్ అనేది చేయలేదు.. అంటోంది ఈ బికినీ మోడల్. కాని తెలుగులో అందాల రాక్షసి సినిమా కారణంగా తనకు అందరూ అదే ముద్రను వేస్తున్నారు అని చెప్పింది.

Lavanya Tripati Ready For Glamorou Roles

”నేను రియల్ లైఫ్ లో అందాల రాక్షసి క్యారక్టర్ కు కొంచం కూడా దగ్గరల్లో ఉండను. అంతా మోడ్రన్ గానే ఉంటాను. అలాగే మోడలింగ్ సమయంలో కూడా గ్లామర్ నే ఒలకబోశాను. అందుకే నేను చాలాసార్లు నా డైరక్టర్లకు చెప్పాను.. నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి అని. గ్లామర్ అంటే ఉన్నపలంగా బట్టలిప్పేస్తానని కాదు.. రోల్ కు కావల్సినట్లు మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో గ్లామరస్ గా కనిపిస్తానని అర్ధం. పూర్వం పూర్తిగా కప్పుకుని కూడా గ్లామర్ అనేవారు. ఇప్పుడు పద్దతులు మారాయి. చూద్దాం ఎవరు ఎటువంటి రోల్స్ ఆఫర్ చేస్తారో” అంటోంది లావణ్య.

అయితే త్వరలో రానున్న శర్వానంద్ ”రాధ” సినిమాలో గ్లామర్ ఒలకబోయడం తప్పించి పెద్దగా రోల్ ఏమీ లేదని.. కాకపోతే నాగచైతన్య తో చేస్తున్న సినిమాలో మాత్రం ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు చెప్పింది. ”మిష్టర్” ఈమెకు ఎటువంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.మరి ఇక ముందు వచ్చే సినిమాలో ఐనా ఈ అందాల రాక్షసికి తన అందాలను అరబోసే పాత్రలు వస్తేయేమె చూద్దం