టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య- సమంత గతేడాది అక్టోబర్ 6న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయిన సంగతి తెలిసిందే. నిన్నటితో వీరి ప్రేమ వివాహం ఏడాది పూర్తి చేసుకుంది. ప్రస్తుతం స్పెయిన్‌లో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ జంట.
ఈ సందర్భంగా చైతూతో కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసింది సామ్. పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలిపింది. మీ ఆశీర్వాదం,ప్రేమ పొందడం సంతోషాన్నిందని ట్వీట్ చేసింది.
గతేడాది గోవాలో చైతూ- సామ్‌ల వివాహం రెండు సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రస్తుతం వీరిద్దరి కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వచ్చే వారం సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి మజిలీ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.
The greatest thing about my life is that I come back home to you everyday . Happy anniversary to the part of me I am most proud of @chay_akkineni . Thankyou all for all your kind and warm messages . We are always grateful and feel extremely special to deserve such love 💕 pic.twitter.com/TxU23l8ELP
— Samantha (@Samanthaprabhu2) October 6, 2018