సహజీవనం అనే పదం ఎక్కువగా బాలీవుడ్ సినీ తారల విషయంలో వింటుంటాం. ప్రేమలో ఉన్న లవ్ కపుల్స్..పెళ్లికాక ముందే ఒకే ఇంటిలో ఉంటు సహజీవనం చేస్తుంటారు. రన్‌బీర్ కపూర్, కత్రీనా..రన్వీర్ సింగ్, దీపికా ఇలా సహజీవనం చేసిన జంటలు చాలానే ఉన్నాయి. దక్షిణాదిలో కమల్ హాసన్, గౌతమి దాదాపు 15 ఏళ్ల పాటు సహజీవనం చేసి రీసెంట్‌గా విడిపోయారు. తాజాగా దక్షిణాదిలో పెళ్లికి ముందే సహజీవనం చేసే జంటల లీస్ట్‌లోకి నాగ చైతన్య, సమంత వచ్చి చేరారు. చైతు..సామ్ గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 2017లో పెళ్లిచేసుకోవడానికి డిసైడ్ అయ్యారు. అయితే జంట పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కాకముందే..ఒకే గూటి పక్షులుగా మారిపోయారట.
హైదరబాద్‌లో నాగచైతన్య ఉంటున్న ఫ్లాట్‌కే సమంత కూడా వచ్చేసిందట. ఇప్పట్నుంచే ఆ ఫ్లాట్‌లో వీరిద్దరూ పెళ్లయిన జంటలా సహజీవనం చేస్తారట. అంతేకాదు పెళ్లికి ముందే హైదరాబాద్‌లోనే ఓ ఖరీదైన విల్లా కూడా కొనాలని నాగచైతన్య ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటి వరకు సమంత ఎప్పుడు హైదరబాద్ వచ్చినా పార్క్ హయత్‌లోనే బస చేసేది. ఇక నుంచి సామ్ హైదరాబాద్ వస్తే చైతన్య ఫ్లాట్‌లోనే ఉంటుందట. ఇప్పటికే సమంత లగేజ్ కూడా చై ఫ్లాట్‌కు చేరిపోయినట్టు సమాచారం.
ప్రస్తుతం చైతన్య ఉంటున్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌కు సమంత కొన్ని రిపేర్లు చేయించాలని డిసైడ్ అయిందట.ఇప్పటికే టాలీవుడ్‌లో హాటెస్ట్ లవ్ కపుల్స్ గా మారిన సామ్, చైతు…సహజీవనంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు. రీసెంట్‌గా సమంత పోస్ట్ పోయిన ఫోటో ఫ్యాన్స్‌లో..ఉత్కంఠ రేపేలా ఉంది. చైతు వల్లో సామ్ వాలినట్టుగా ఉన్న ఆ ఫోటో తమ బంధం ఎంత దృడంగా ఉందో తెలిపేలా ఉందంటున్నారు అభిమానులు.