సమంత మనసులో మాటలు

42
- Advertisement -

రెండేళ్లలో ఎన్నో ఊహించని పరిణామాలు, జీవిత పాఠాలు ఎదురయ్యాయని స్టార్ హీరోయిన్ సమంత అన్నారు. గుణశేఖర్ డైరెక్షన్‌లో సమంత లీడ్ రోల్‌లో తెరకెక్కించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవిత పాఠాల నుంచే మనం మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. అయితే, ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

ఇంతకీ ఆ అభిమాని ఏం అడిగాడు?, సమంత ఏం సమాధామిచ్చింది అంటే.. ‘మీరు ఇన్ని సమస్యలు ఎదుర్కున్న తర్వాత ఇంతటి బలాన్ని ఎక్కడి నుంచి సంపాదించారు. ధైర్యంగా ముందుకు వెళ్లడం మీకు ఎలా సాధ్యం అవుతుంది’’ అని సమంతను ఆ అభిమాని ప్రశ్నించాడు. దీనికి సమంత సమాధానమిస్తూ.. ‘నా జీవితం ఎలా ఉండాలో నేనే నిర్ణయించుకుంటా” అని బదులిచ్చింది. ఇక సమంత అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అల్లు అర్హ గురించి సమంత మాట్లాడుతూ.. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో అల్లు అర్హ.. తండ్రితో పోటీ పడుతోంది. ఇక అర్హ కెరీర్‌ విషయంలో అల్లు అర్జున్‌ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. తన నిర్ణయాలు తానే తీసుకోగలదు. ఆమెకు అంత ఆలోచనా శక్తి ఉంది. పిల్లలందరూ అర్హ పాత్రకు బాగా కనెక్ట్‌ అవుతారు.’ అని సమంత చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి…

PSPK:గుడ్‌న్యూస్ త్వరలో వకీల్‌సాబ్‌-2..!

Kollywood:మారితో ధనుష్ మరో కొత్త సినిమా..!

ఉగ్రం..అల్బెలా అల్బెలా సాంగ్‌ లాంచ్‌ బై నాని

- Advertisement -