వీరు సాహసం శ్వాసగా సాగిపోతారట..!

216
- Advertisement -

నాగచైతన్య తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని సమంత కూడా ప్రమోట్ చేయనుందట. నిజానికి సమంతకి ఈ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే సమంత గౌతమ్ మీనన్‌ను గురువుగా భావిస్తుంది. ఆ కారణం చేతనే సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ప్రమోషన్ రావడానికి ఒప్పుకుందట. అందరూ ఇదే కారణం అనుకున్నా చైతన్య మీద ఉన్న ప్రేమతోనే సమంత ఇదంతా చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.

Samantha-Ruth-Prabhu-and-Nagachaitanya

అధికారికంగా ఈ చిత్రం ప్రమోషన్ చేస్తానని ఒప్పుకున్నప్పటికీ అనధికారికంగా ‘ప్రేమమ్’ సినిమాకు ఈమె బోల్డంత ప్రచారం కల్పించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్ర్రేమమ్ గురించి ఏదో ఒక వార్తా రాస్తూనే ఉంది. ఐతే వీరు వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు నాగచైతన్య స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నాగచైతన్య,సమంత కలిసి చేసే ప్రచారం సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు ఎంత పెద్ద విజయం సాధించి పెడుతుందో చూడాలి మరి..!

- Advertisement -