సమంత ఎక్స‌ర్‌సైజ్ అదుర్స్‌.. వీడియో !

215
Samantha cute exercise video
Samantha cute exercise video
- Advertisement -

త్వరలోనే నాగ చైతన్య -సమంతలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న సంగతి తెలిసిందే, ఎప్పుడెప్పుడా అని ఆ శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు . . ప్రస్తుతం తెలుగులో రంగస్థలం 1985, మహా నటి, రాజుగారి గది 2 చిత్రాలు చేస్తున్న సామ్ తమిళంలోను కొన్ని సినిమాలు చేస్తుంది సమంత. ఒక వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. ఇక సమంత ఫిట్‌నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మగాళ్లతో సమానంగా వర్కౌట్లు చేస్తుంది. ఆ మధ్య నాగచైతన్య సమంత జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తున్న వీడియో ఒకటి హల్ చల్ చేసింది.

రీసెంట్ గా తన ఇనస్ట్రాగ్రామ్ లో ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది. దానికి నేను చేయవచ్చు .. చేయలేక పోవచ్చు అనే కామెంట్ పెట్టింది. అయితే సమంత చేస్తున్న ఈ ఎక్సర్ సైజ్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో `ఎక్స‌ర్‌సైజ్ కూడా ఇంత క్యూట్ చేస్తారా?` అంటూ, బాల్ ఫ్లాంక్స్ చేస్తున్న సమంత అదుర్స్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. వీడియోలో ఏడు ప్లాంక్స్ వ‌ర‌కు బాగానే చేసింది. త‌ర్వాత తాను న‌వ్విన ఒక్క చిన్న న‌వ్వుకు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా చూడండి.

- Advertisement -