సమంత మెయిన్ లీడ్ గా నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా ఫిబ్రవరి 17 న రిలీజ్ అంటూ ఈ మధ్యే ఎనౌన్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. అదే డేట్ కి రెండు , మూడు సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ పోస్ట్ పోన్ చేసేదే లేదు అంటూ దిల్ రాజు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.
నిజానికి సమంత ఫిబ్రవరి 1 నుండి శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొన బోతుందని వారం పాటు డేట్స్ ఇచ్చిందని టాక్ వినిపించింది. కట్ చేస్తే సమంత సైలెంట్ గా హిందీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి షూటింగ్ లో పాల్గొని సెట్స్ పైకి వచ్చింది. దీంతో శాకుంతలం ప్రమోషన్స్ కి సమంత డేట్స్ ఇవ్వలేదు పైగా శాకుంతలం కంటెంట్ ఇంకా రెడీ అవ్వలేదని పది హేను రోజుల్లో ఫస్ట్ కాపీ రావడం కష్టమే అని అంటున్నారు.
శాకుంతలం టీం నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. ట్రైలర్ , సాంగ్స్ తో ప్రమోషన్స్ ఆపేశారు. రిలీజ్ వాయిదా పడినందువల్లే ప్రమోషన్స్ ఆలస్యం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి మేకర్స్ పోస్ట్ పోన్ విషయాన్ని త్వరలోనే చెప్పే అవకాశం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి…