తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో పలువు సినీ సెలబ్రిటీలు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు క్రిస్మస్ సందర్భంగా సమంత తన భర్తతో కలిసి వేడుకలు జరుపుకుంది. తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించుకున్న సమంత ట్రీ పక్కన నిలుచొని భర్త చైతూతో కలిసి ఫోటోలు దిగింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఈ చిత్రానికి మజిలీ అనే టైటిల్ పరిశీలిస్తుండగా ఇందులో చైతూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ థియేటర్స్‌లోకి రానుంది. ఈ మూవీ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ రీమేక్ చిత్రం చేయనున్నట్టు సమాచారం.