సమంతను మెప్పించిన సాయి..

326
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో న్యూయార్క్‌లో హాలిడే ట్రిప్‌ ఎంజాయ్ చేస్తోంది. ఎనిమిదేళ్ల కిందట ‘ఏ మాయ చేసావె’ షూటింగ్ సందర్భంగా అదే స్పాట్‌లో సందడి చేసిన ఈ జోడి.. ఆ పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సమంత నటించిన ‘రంగస్థలం’ సినిమా అంచనాలకు మించి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళుతుండటం ఆమెకు మరింత ఆనందాన్ని అందిస్తోంది.

they-are-spreading-lies-on-rangasthalam_b_0903180623

అయితే ఈ అమ్మడు అమెరికాలో విహారయాత్రలో ఉన్న కారణంగా హైదరాబాద్ లో తాజాగా నిర్వహించిన ‘రంగస్థలం’ థ్యాంక్యూ మీట్ కు సమంత హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రముఖ నటి సమంత ఆసక్తికర సమాధానాలిచ్చింది.

మీ జీవితంలో ఉత్తమమైన, మర్చిపోలేని రోజు ఏది? అని ఒ అభిమాని అడిగిన ప్రశ్నకు నా పెళ్లి రోజు అని సమాధానం ఇచ్చింది సామ్‌..మరి అక్కినేని నాగచైతన్య భార్య, నాగార్జున కోడలు, లెజెండ్ ఏఎన్నార్ మనవరాలు..వీటిలో ఏ విషయానికి మీరు గర్వపడతారు? అని అడగ్గా కొంచెం కష్టమైన ప్రశ్నే అంటు.. నా భర్తకు భార్యను కావడం గర్వంగా వుందని సరదాగా సమాధానమిచ్చింది . ఒకవేళ మీరు అబ్బాయి అయి ఉంటే, ఏ హీరోయిన్ పై క్రష్ ఉండేదని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొణే అని టక్కున జవాబు చేప్పేసింది సమంత.

Samantha Chat With Fans On Twitter

‘ఒత్తిడికి గురైతే ఏం చేస్తారు?’ అని ఓ అభిమాని అడగ్గా.. ‘నిద్రపోతా’ అని చెప్పిన సామ్‌.. రంగస్థలం’లో రామ్ చరణ్ తో మీరు కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?- ది బెస్ట్. చరణ్‌ చాలా సౌమ్యుడు అని తెలిపింది. ప్రస్తుత తెలుగు, తమిళ సినిమాల్లో ఏ నటి మిమ్మల్ని బాగా మెప్పించింది? అని చివరగా అడిగిన ప్రశ్నకు సాయిపల్లవి అని తన అభిప్రాయన్ని తెలిపింది సామ్‌. నెటిజిన్లు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి తనదైన శైలిలో సమంత సమాధానాలు ఇచ్చింది..

- Advertisement -