సమంత ఒడిలో పిల్లలు.. వైరల్!

37
- Advertisement -

స్టార్ హీరోయిన్ గా డిమాండ్ ఉండగానే సమంత సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బాలి వెకేషన్కు వెళ్లి తిరిగొచ్చిన సమంత.. చంటిపిల్లలను ఆడిస్తూ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. సడెన్ గా సమంత ఒడిలో పిల్లలను చూసి.. ఎవరు వీళ్ళు ?, సమంతకు ఏం అవుతారు ? అంటూ నెటిజన్లు షాక్ అయ్యారు. తీరా విషయం తెలిసాక, ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. చెన్నైలోని తన ఫ్రెండ్స్ చిన్మయి-రాహుల్ ఇంటికి సమంత నిన్న వెళ్లింది. అక్కడ వారి పిల్లలతో కలిసి కాసేపు సరదాగా జాలీగా గడిపింది.

అనంతరం ఆ చిన్నారులతో సూపర్ హిట్ సాంగ్ ‘RRR’లోని నాటు నాటుకు డ్యాన్స్‌ వేయించింది. పైగా ఈ వీడియోను సమంత ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక పిల్లలతో కలిసి ‘నాటు నాటు’ పాటకు సమంత డ్యాన్స్ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని.. సమంత ఇంత సంతోషంగా కనిపించి చాలా కాలం అయిందని సామ్ ఫ్యాన్స్ కూడా పోస్ట్ లు పెడుతున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంతకు తోడుగా స్టార్ సింగర్ చిన్మయి నిలబడింది అని ఆమెను సమంత ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

Also Read:ఎంపీగా రాహుల్..నోటిఫికేషన్ జారీ

ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ‘గుంటూరు కారం’లో ఓ ఐటెమ్ సాంగ్‌కు సమంత ‘నో’ చెప్పింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటెమ్ సాంగ్‌ కోసం సమంత ని సంప్రదిస్తే ‘నో’ చెప్పిందట. నిజానికి త్రివిక్రమ్ హీరోయిన్‌గా తనకు ఛాన్స్ ఇస్తానని చెప్పి.. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయమంటున్నాడనే బాధతోనే సమంత ఐటెమ్ సాంగ్ చేయడం లేదని టాక్‌.

- Advertisement -