- Advertisement -
‘యూటర్న్’ మళ్ళీ సమంతాకే ఫిక్సైంది. పోయిన ఏడాది కన్నడలో వచ్చిన ‘యు టర్న్’మూవీ సూపర్ హిట్ కొట్టేసింది. అయితే ఈ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేయడానికి దర్శకుడు పవన్ కుమార్ సన్నాహాలు చేస్తున్నాడు.
ఈ సినిమాని మొదట సమంతతోనే చేయాలనుకుంది చిత్రటీమ్. కానీ ఆమె వివాహం కారణంగా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో, నయనతారను .. నిత్యామీనన్ ను సంప్రదించారట. అయితే నయనతార డేట్స్ ఖాళీ లేవని చెప్పడం, నిత్యామీనన్ కుదరదని చెప్పడం వలన మళ్ళీ సమంతవైపే చూసింది చిత్రటీమ్. సమంత కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇక ఈ సమంత ప్రధానమైన పాత్రను పోషించనున్న ఈ సినిమాలో, ఆమె బాయ్ ఫ్రెండ్ గా రాహుల్ రవీంద్రన్ కనిపించనున్నాడు. ముఖ్యమైన పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి చేయనున్నాడు. మొత్తానికి తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.
- Advertisement -