సీఎంతో.. సల్లూభాయ్‌ టీమ్‌..

234
- Advertisement -

బాలీవుడ్‌ మోస్ట్‌బ్యాచులర్‌, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘రేస్‌-3’. తాజాగా ఈ మూవీ టీమ్ జమ్మూకాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీని కలిసింది. రేస్‌-3 సినిమా షూటింగ్‌ కోసం శ్రీనగర్‌ వెళ్ళింది ఈ టీమ్‌. ఈ క్రమంలోనే సల్మాన్‌ఖాన్‌ మెహబూబాను కలిసి మాట్లాడారు.

 Salman Khan And Race 3 Team Meets CM Mehbooba Mufti During

శ్రీనగర్‌ ప్రాంతంలోని సోనామార్గ్‌ హిల్ స్టేషన్ లో రెండురోజుల పాటు జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌ బృందానికి సీఎం మెహబూబా సాదర స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్‌ షెరాతో కలిసి సీఎం మెహబూబాతో దిగిన ఫోటోను రమేష్‌ తౌరనీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇక రెమోడిసౌజా దర్శకత్వం వహిస్తున్న రేస్ 3 సినిమాను రమేష్ తౌరనీ నిర్మిస్తున్నారు. కాగా..అనిల్ కపూర్, బాబీడియోల్ జాక్విలిన్ ఫెర్నాండేజ్, డైసీషా, షాకిబ్ సలీం నటించిన ఈ మూవీని ఈద్ సందర్భంగా జూన్ 15వతేదీన విడుదల చేయనున్నారు.


 

- Advertisement -