మధురవాణిగా మారిన.. రామలక్ష్మి..

349
Samantha Akkineni as Madhuravani in Mahanati
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహానటి సినిమాలో సమంత తన లుక్ ని ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది. మహానటిలో తన పాత్ర చాలా బాగుంటుందని, ఈ సినిమాలో మధురవాణిగా పరిచయంకానున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది. సమంత ట్వీట్ చేసిన పోటోలో నాపేరు కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే మధురవాణి బీఏ గోల్డ్ మెడలిస్ట్ అని ఉంది. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. సినిమా ప్రచారంలో భాగంగా సమంత లుక్‎ని చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.

ఇప్పటికే రంగస్థలంలో రామలక్ష్మిగా తన నటన, అందచందాలతో అందరిని ఆకటుకుంది. మహానటిలో జర్నలిస్టు పాత్రతో అందరి ముందుకు రానుంది. ఇందులో తన క్యారెక్టర్ కోసం సమంత చాలానే కష్టపడుతుంది. తన మధురవాణి పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనుందట. సమంత లుక్‎కి నెటిజన్లు ఫిదా అవుతున్నారట. మరిన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని సమంత ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారట. ఈ మూవీలో ప్రముఖ నటులు మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ప్రధాన పాత్రలుగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుంది.

- Advertisement -