ఐపీఎల్‌ విజేత ఎవరో చెప్పేశాడు…!

201
Who Will Win IPL 2018 as per Astrology
- Advertisement -

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. 52 రోజుల పాటు జరిగే ఐపీఎల్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇప్పటివరకు మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ముంబై మరోసారి టైటిల్ వేటలో ఉండగా ఎలాగైనా ఐపీఎల్‌ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు బెంగళూరు కెప్టెన్ కోహ్లి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఒక్క మ్యాచ్ ప్రారంభం కాకుండానే విజేతను ప్రకటించాడు జ్యోతిష్యుడు గ్రీన్ స్టోన్ లోబో. రెండేళ్ల నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చెన్నైతో పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ ఐపీఎల్‌ గెలిచే అవకాశం లేదని చెప్పాడు. ఇక అనుభవజ్ఞులైన కెప్టెన్లు దూరం కావడంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు విజయావకాశాలు సన్నగిల్లాయని తెలిపాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ,రోహిత్ జాతకం చూస్తే ముంబై ఇండియన్స్ జట్లు ట్రోఫీ గెల్చుకోవడం కష్టమని చెప్పాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లలో ఏదో ఒకటి నిలుస్తుందని గ్రీన్ స్టోన్ లోబో తెలిపాడు. కాగా, పదేళ్ల క్రికెట్ సీజన్ లో ఈ రెండు జట్లు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని సాధించలేదు.

- Advertisement -