సమంత సంచలన వ్యాఖ్యలు

1
- Advertisement -

ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్యలు మరియు జీవితంలో ఎదుర్కొన్న కష్ట కాలం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన ‘మైయోసిటిస్’ బారిన పడిన సమయంలో తానూ నటనకు శాశ్వతంగా స్వస్తి చెప్పాలని అనుకున్నానని అయితే ఆ సమయంలో వ్యాపార రంగానికి వైపు మళ్లడం తన జీవితాన్ని మార్చివేసిందని తెలిపారు.

సమంత మాట్లాడుతూ… మైయోసిటిస్ వ్యాధి బారిన పడినప్పుడు తన శరీరం తీవ్రమైన నొప్పులు, బలహీనతకు గురైందని తెలిపారు. ఆ పరిస్థితుల్లో మళ్లీ సాధారణ జీవితం గడపడం, కెమెరా ముందుకు వచ్చి నటించడం సాధ్యమవుతుందా లేదా అనే తీవ్ర అనుమానాలు తనలో కలిగాయని చెప్పారు. మానసికంగా, శారీరకంగా ఎంతో కుంగిపోయిన ఆ సమయంలో నటనా రంగాన్ని పూర్తిగా వదిలేయాలని తీవ్రంగా ఆలోచించినట్లు వెల్లడించారు.

ఆరోగ్య రీత్యా సినిమాలకు విరామం ఇచ్చిన సమయంలో సమంత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆరోగ్యం సహకరించని సమయంలో ఖాళీగా ఉండకుండా విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టడం, స్వంత బ్రాండ్లను ప్రారంభించడం వైపు దృష్టి సారించారు. ఆరోగ్య సంరక్షణ , ఫ్యాషన్ రంగాలతో పాటు వివిధ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతూ “సీరియల్ ప్రొప్రెటోర్/ఎంటర్‌ప్రెన్యూర్” గా మారినట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో సాధించిన ప్రగతి తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, కేవలం నటనపైనే కాకుండా ఇతర రంగాల్లోనూ రాణించగలననే నమ్మకాన్ని పెంచిందని ఆమె తెలిపారు.ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించి మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావడం మరియు వ్యాపారవేత్తగా విజయవంతంగా ముందుకు సాగడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని సమంత స్పష్టం చేశారు.

Also Read:తండ్రి ఆస్తిపై కుమార్తెకు పూర్తి హక్కు!

- Advertisement -