ఆ మొండితనమే..నన్ను నిలబెట్టింది!

260
- Advertisement -

వెండి తెర..రంగురంగుల ప్రపంచం. అందమైన లోకం. టాలెంట్ ఉండి కాలం కలిసివస్తే చాలు టాప్ హీరో, హీరోయిన్‌లు ఎదగిపోవచ్చు. అలా ఇండస్ట్రీలోకి స్వయంకృషితో వచ్చి తమను తామెంటో నిరూపించుకున్న నటులెంతమందో. అలాంటి వారిలో ఒకరు సమంత. సినిమా కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది సామ్. తాను చేసిన సినిమాల్లోని పాత్రలే ఇందుకు ఉదాహరణ.

ఇక తాజాగా సమంత నటించిన యశోద ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె అరుదైన వ్యాధి మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసినా షూటింగ్ మాత్రం ఆపలేదు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని బయటకు చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ఇక కదల్లేని స్థితిలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో సోషల్ మీడియా ద్వారా పాల్గొంటన్నారు సామ్‌.

ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రాణం పెట్టి నటించిన తరవాత సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ఉంటుందని తనకు ఆ కోరిక ఉండేదని యశోదతో అది తీరిందని తెలిపారు. అయితే కష్టకాలంలో ఆరోగ్యం బాగాలేకపోయినా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తనకు మొండితనం ఎక్కువ అని..అందుకే ఒకసారి డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా చేసేశాను అని తెలిపింది.

చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ నుండి బయటపడిందో లేదో అంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించిన వార్త జీర్ణించుకోలేనిది. తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దేవుళ్లను ప్రార్థించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె మనసును మరింత గాయపర్చేలా కథనాలు రాసినా…తానింకా చావలేదని మంచి రోజులు, కొన్ని చెడు రోజులు జీవితంలో ఉంటాయని వాటన్నింటిని తట్టుకొని ముందుకు వెళ్తున్నానని చెప్పి గొప్ప మనసును చాటింది. సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసిన వారు సెల్యూట్‌ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -