చైతు ఎఫైర్ పై ‘సమంత’కు ప్రశ్న

34
- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల మధ్య ఎఫైర్ ఉందన్న వస్తున్న వార్తలపై సమంత స్పందన తెలుసుకోవాలని నెటిజన్లు చాలా రోజుల నుంచి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఇక నెటిజన్లు వదిలి పెడతారా ?, చైతు విషయం గురించి ఆమెను పదే పదే ప్రశ్నించారు. కానీ సమంత మాత్రం అలాంటి ప్రశ్నలకు రియాక్ట్ కాలేదు. ఐతే, జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటున్న యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికి మాత్రం తనదైన శైలిలో బదులిచ్చింది.

ఇంతకీ, సమంత ఏం సమాధానం చెప్పింది అంటే.. ‘ఏదైనా ఒక సమస్య వస్తే, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకోవద్దు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు. యువత జీవితం ఇప్పుడే మొదలవుతుంది.. సమస్యలు పలకరిస్తాయి.. వాటికి భయపడి పారిపోవద్దు.. అవే మనల్ని రాటుదేలుస్తాయి’ అని సమంత చెప్పుకొచ్చింది. మరి సమస్యలే రాటుదేలుస్తాయి అంటున్నారు. కానీ మీ సమస్యల గురించి ఎందుకు చెప్పడం లేదు అంటూ మరో నెటిజన్ ఘాటుగా అడిగాడు. దానికి కూడా చిన్న స్మైల్ ఇస్తూ సమంత ఆ ప్రశ్నను దాట వేసింది.

మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో సమంత అన్ని విషయాలను ముచ్చటించింది గానీ, అసలు విషయాన్ని మాత్రం దాచేసింది. మరోవైపు చైతుతో ఎఫైర్ పై హీరోయిన్ శోభిత దూళిపాళ్ల స్పందించింది.‘‘సగం జ్ఞానంతో రాసే వారి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అందులో నిజం లేనప్పుడు నేను ఎందుకు స్పందించాలి. వైరల్ అవుతున్న న్యూస్‌లో ఎలాంటి నిజం లేనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు” అని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -