సమంత@13యేళ్లు ఇన్‌ సినిమాస్

50
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌ పదేళ్లు టాప్‌గా ఎదగడమంటే అషా మషీ కాదు. కానీ ఈ ఫీట్‌ను సాధించిన కొద్ది మంది హీరోయిన్‌లలో ఒకరిగా సమంత రూత్ ప్రభు నిలిచింది. గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావేతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సమంత తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. జెస్సీగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన అందంతోనే కాదు నటనతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సమంత ప్రతి మూమెంట్‌ను అభిమానులతో పంచుకుటుంది.

తాజాగా  సామ్ పెట్టిన ఓ ఫోటోను నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గత కొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడిన సమంత… తాజాగా తన అభిమానులకు బాగా దగ్గరవుతోంది. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తరచుగా టచ్‌లో ఉంటుంది.  గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. నల్లటి గుర్రంపై నలుపు రంగు దుస్తులు వేసుకున్న సమంత ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ ఫోటోతో పాటు ది బ్యూటీ అండ్‌ ది బీస్ట్ రెండూ నీవే అని పేర్కొంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సమంత అభిమానులు ఆ ఫోటోను చూసి క్వీన్ ఈజ్ బ్యాక్‌ అంటూ ఆనందంతో కామెంట్స్ పెడుతున్నారు.

సమంత సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ కోసం తీవ్ర కసరత్తులు చే్స్తోంది. తాజాగా దీని కోసం 8డిగ్రీల ఉష్ణోగ్రతలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సిరీస్ ఇది. అంతే కాదు విజయ్ దేవరకొండ సరసన వస్తున్న ఖుషి సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లోనూ సమంత పాల్గొననుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాను ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఇవి కూడా చదవండి…

పుష్పరాజ్ పాత్ర చేయాలనుంది:రణ్‌బీర్‌

ఫ్లాప్‌లపై అక్షయ్ ఏమన్నారంటే..?

బాలీవుడ్ ని దెబ్బతీస్తున్న రీమేక్స్

- Advertisement -