శ్రేయాఘోషల్‌ నోట సామజవరగమన పాట

403
- Advertisement -

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈమూవీ టీజర్ , పాటలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సామజవరగమన సాంగ్ మాత్రం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. 100మిలియన్ల్ వ్యూస్ ను దాటి రికార్డు సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు ట్యూన్స్‌ తమన్‌ కంపోజ్‌ చేయగా సిద్‌ శ్రీరామ్‌ పాడారు.

సామజవరగమన పాటకు యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ పాటకు వచ్చిన క్రేజ్‌ను చూసి చిత్రబృందం దీన్ని ఫీమేల్‌ వాయిస్‌లో కూడా పాడించారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయాఘోషల్‌ ఈ పాటను పాడారు. తాజాగా విడుదలైన ఈ వీడియోకు సైతం సూపర్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈసాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలిస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.

https://youtu.be/guj4nJFvLo4

- Advertisement -