చామకూరి కంబైన్స్ ‘సమాజానికో హెచ్చరిక’ సినిమా పాటల రికార్డింగ్ S.A స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శివ కృష్ణ, జవర్ధస్ట్ అప్ప రావు, రాకింగ్ రాజేష్, అలేఖ్య, ప్రియాంక, గీత సింగ్ పాల్గొన్నారు. నిర్మాత చామకూరి మట్లాడుతూ… ముగ్గురు యువకులు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ.. సమాజానికి ఎలా ఉపయోగపడ్డారో తెలియజేస్తూ.. సేవ్ గర్ల్ చైల్డ్.. అన్న పాయింట్ చుట్టూ అలుకున్న కథ ఈ ‘సమాజానికో హెచ్చరిక’ సినిమా అని నిర్మాత చామకూరి ఎమ్ అన్నారు.
నటీనటులు: ప్రియాంక, అలేఖ్య, దివ్య హీరోయిన్స్ గా నటిస్తుండగా.. శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, రాకింగ్ రాజేష్, స్టీల్ ప్లాంట్ శ్రీనివాసరావు, బ్యాంక్ మధు, శ్రీనివాస చక్రవర్తి, నామ బాబ్జి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, డీఓపీ: సిహెచ్ శివ భగవాన్, సహా నిర్మాత: సుంకర మణిరాజ్, పాటలు: సురేంద్ర కృష్ణ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాజబాబు అచ్చర్త, కథ, మాటలను, నిర్మాత: చామకూరి. ఎమ్.