- Advertisement -
కరోనా క్రికెటర్లను వదలడం లేదు. ఇప్పటివరకు పాక్,దక్షిణాఫ్రికా క్రికెటర్లు కొంతమంది కరోనా బారీన పడగా ట్రీట్ మెంట్ తీసుకుని కొలుకుంటున్నారు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది.
స్వల్పంగా జ్వరం, డయేరియాతో బాధపడుతుండటంతో కరన్‌కు కరోనా టెస్ట్ చేశారు. టెస్టు రిపోర్టు నెగటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 22 ఏళ్ల కరన్….ఇంగ్లాండ్‌లో స్టార్ ఆల్రండర్గా ఉన్నాడు.
త్వరలో కరన్ ట్రైనింగ్‌లో పాల్గొంటాడని తెలిపిన ఈసీబీ…..మిగతా జట్టు సభ్యులు, సహాయ సిబ్బందికి ఆదివారం మరోసారి కరోనా పరీక్షలు చేయనున్నారు.
- Advertisement -