సామ్ ని బంధించిన చైతూ..!

609
samantha
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరోయిన్లలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ సమంత. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న సామ్‌…ప్రస్తుతం హాలీడే ట్రిప్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది.

సమంతతో కలిసి స్పెయిన్‌కి వెళ్లారు చైతూ. చై-సామ్‌ తో పాటు స్పెయిన్‌ వెళ్లిన వారిలో అక్కినేని అఖిల్‌, మరికొందరు స్నేహితులు ఉన్నారు. ఈ సందర్భంగా చైతు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర తీర ప్రాంతం ఇబిజాలో సరదాగా షికారు చేస్తూ సమంత ఫోటోను నాగచైతన్య తీయగా సామ్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పెళ్లి తర్వాత చై-సామ్‌ జంటగా నటించిన ‘మజిలీ’ వీరికి మధురమైన విజయాన్ని అందించింది. మజిలీ తర్వాత ‘వెంకీమామ’ చిత్రీకరణలో చైతు, ఓ బేబీ తర్వాత 96 చిత్రీకరణలో సమంత నిమగ్నమయ్యారు. సినిమా షూటింగ్ సమయంలో ఖాళీ దొరకడంతో ప్రస్తుతం విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -