Matka: పద్మగా సలోని

4
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.

సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు, సలోని క్యారెక్టర్ ని పద్మగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సలోని చీరకట్టులో హుందాగా కనిపించారు. సాడ్ నెస్, స్ట్రెంత్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో ఆమె క్యారెక్టర్ డెప్త్ తెలియజేస్తోంది.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

Also Read:అక్కినేని ఇంట..పెండ్లి పనులు షురూ

 

- Advertisement -