నాకు ఒక అమ్మాయి దొరికింది- సల్మాన్‌

224
- Advertisement -

బాలీవుడ్‌ను వేదిస్తున్న ఒకే ఒక ప్రశ్న ‘సల్మాన్ ఖాన్’ పెళ్లెప్పుడు? ఔను, అతడితో పాటు సినీరంగంలో అడుగుపెట్టిన హీరోలు ఇప్పటికే పెళ్లిల్లు చేసుకుని, వారి పిల్లలను బాలీవుడ్‌కు కూడా పరిచయం చేసేస్తున్నారు. అయితే యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖానే. సల్మాన్ కు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా పతాక శీర్షికల్లోనే ఉంటుంది. తాజాగా ఓ ట్వీట్ ద్వారా సల్మాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ‘నాకు ఒక అమ్మాయి దొరికింది’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సల్మాన్ పెళ్లికి సంబంధించిందేనా? అనే ఆసక్తి ఇప్పుడు అందర్లో నెలకొంది.

Salman Tweets, 'Mujhey ladki mil gayi'!

గత కొంతకాలంగా లులియా వాంటూర్ తో సల్మాన్ సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కూడా ఇటీవల వినిపించాయి. ‘సల్మాన్ తనకు మంచి మిత్రుడు మాత్రమే’ అని లులియా కామెంట్ చేయడంతో… ఇద్దరూ ఒకరికొకరు దూరం జరిగారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సల్మాన్ చేసిన ట్వీట్ తో… అతని పెళ్లి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -