బాలివుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింక వేట కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. తొలిరోజు జైల్లో నిద్రలేకుండా గడిపిన సల్మాన్ బెయిల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే, సల్మాన్ ఆశలపై నీళ్లు చల్లింది న్యాయస్థానం. బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో రెండోరోజు సల్మాన్ జైల్లోనే గడపాల్సిన పరిస్థతి నెలకొంది.
జోద్ పూర్ జైలు బరాక్ నెంబర్ 2లో ఉన్న సల్మాన్ తొలిరోజు ఏమీ తినకుండానే ఉన్నారట. రొట్టె, పప్పు ఇచ్చినా తినటానికి సల్మాన్ నిరాకరించారు. సల్మాన్ కు గ్యాంగ్ స్టర్ ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రతను మాత్రం కట్టుదిట్టం చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాడ్ మ్యాన్ ఆశారాం బాపూజీ కూడా ఇదే బరాక్ లో ఉన్నారు.
ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడటంతో బెయిల్ వస్తుందా రాదా అనే టెన్షన్లో ఉన్నారు నిర్మాతలు. ప్రస్తుతం సల్మాన్ నాలుగు సినిమాలకు కమిట్ కాగా వాటి విలువ రూ. 1000 కోట్లకు పైనే ఉంది. కొన్ని సినిమాల షూటింగ్ సగం వరకు రావడంతో సల్మాన్‌కు బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటనేదానిపై నిర్మాతలు సందిగ్దంలో ఉన్నారు.