ఇరగదీసిన సానియా….సల్లూ భాయ్‌

252
Salman & Sania Mirza’s mean dance moves
- Advertisement -

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలి సంగీత్ గ్రాండ్ గా జరిగింది. గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన వేడుకకు సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. టాలీవుడ్ హీరో.. బాహుబలి ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ప్రభాస్ తో పాటు రాంచరణ్,వెంకటేశ్, రానా, సుశాంత్ వచ్చారు. ఈ వేడుకలకు బాలీవుడ్ హీరో సల్మాన్ తో పాటు పలువురు హాజరయ్యారు. సంగీత్ లో సానియా, ఆమె భర్త షోయబ్ మాలిక్,సల్మాన్‌ చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఒకరు టెన్నిస్ రాకెట్‌తోను, మరొకరు క్రికెట్ బ్యాట్‌తోను సందడి చేశారు.

Salman & Sania Mirza’s mean dance moves

ఈ సందర్భంగా సానియా, ఆనమ్‌మీర్జా ఇద్దరి పెళ్లి సంగీత్‌లకు కొరియోగ్రఫీ అందించిన ట్విస్ట్‌ అండ్‌ టర్న్‌ సంస్థ కొరియోగ్రాఫర్‌ ఆర్యన్ సంగీత్ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక బ్లాక్‌ బస్టర్‌ ఈవెంట్‌. ఈ సంగీత్‌ను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దాం. గర్ల్స్‌ వర్సెస్‌ బాయ్స్‌ థీమ్, బాలీవుడ్‌ థీమ్, కపిల్‌శర్మ షో… వంటివి ఈ ఈవెంట్‌కి హైలెట్‌.

Salman & Sania Mirza’s mean dance moves

థీమ్స్‌లోనూ డిఫరెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ను తొలిసారిగా ఈ సంగీత్‌ కోసం కలగలిపాం. సుల్తాన్ లోని ‘బేబీ కో బేస్‌ పసంద్‌ హై’ పాటకు సానియా, షోయబ్‌ల డ్యాన్స్ , వీరితో కలిసి సల్మాన్ ఖాన్, పరిణితి చోప్రాలు సైతం అడుగులు కదపడం వంటి ఆకర్షణలెన్నో యాడ్‌ అయ్యాయి. సెలబ్రిటీ సంగీత్‌తో పాటు బంధువులు, సన్నిహితుల కోసం మరో ప్రత్యేక సంగీత్‌ను కూడా నిర్వహించామని తెలిపాడు.

- Advertisement -