నోట్ల మార్పిడికి సిరా చుక్క వద్దు..

227
- Advertisement -

పెద్దనోట్ల రద్దుతో పాతనోట్లు మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్నా బ్యాంకుల్లో బారులు తరగకపోవడంపై కేంద్రం దృష్టి సారించింది. పాతనోట్లు మార్చుకుంటున్న వారు రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తున్నారని.. దీంతోనే బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీన్ని నివారించేందుకు నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరాగుర్తు వాడాలని నిర్ణయించింది. గత రెండు మూడు రోజులుగా నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు నిబంధనను అమలు అవుతోంది. అయితే బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది.

Election Commission

త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిరా గుర్తు వాడకంపై గందరగోళం నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల సిరాగుర్తు వాడకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎలక్షన్ కమీషన్‌ అభ్యంతరంతో కేంద్రం ఆర్ధిక మంత్రిత్వ శాఖ పునారోచనలో పడినట్టైంది. ఈసీ కోరిక మేరకు సిరా గుర్తు నిబంధనను ఉండాల,,తీసివేయాలనే సందిగ్దంలో పడింది. అయితే సిరా గుర్తుపై ఇప్పటి వరకు కేంద్ర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈసీ వినతికి కట్టుబడి…ఇంకేదైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -