సాయం కోసం సల్మాన్‌ హీరోయిన్‌..

257
Salman Khan's 'Veergati' co-star Pooja Dadwal fighting TB
- Advertisement -

అలనాటి బాలీవుడ్‌ నటి పూజా దడ్వాల్‌ తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ హీరోగా 1995లో రిలీజైన ‘వీర్‌గతి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది పూజా. తనకు టీబీ సోకిందని ఆరు నెలల కిందట వైద్యులు నిర్థారించారని, ఈ విషయం తెలియగానే తన భర్త, కుటుంబం తనను వదిలేశారని ఆమె వాపోయింది. గత పదిహేను రోజులుగా ముంబైలోని సెవ్రీలో ఉన్న టీబీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.

Salman Khan's 'Veergati' co-star Pooja Dadwal fighting TB

అయితే ఒంటరిగా ఉన్న తనను ఆదుకునే వారు ఎవరూ లేరని, చికిత్స చేయించుకునే స్తోమత కూడా తనకు లేదని, సాయం కోసం సల్మాన్‌‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఆమె తెలిపింది. తన బాధ గురించి తెలిస్తే ఆయన సాయం చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.

చాలా ఏళ్లపాటు గోవాలో క్యాసినో నడిపానని, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కనీసం ఓ కప్పు టీకి కూడా ఇతరులపై ఆధారపడుతున్నానని ఆమె తన దయనీయ స్థితి గురించి వివరించింది. వీర్‌గతి చిత్రంలో అతుల్ అగ్నిహోత్రి సరసన ఆమె నటించింది. అలాగే హిందూస్తాన్, దబ్‌దబా, సింధూర్ కి సౌగంధ్ చిత్రాల్లోనూ ఆమె యాక్ట్ చేసింది.

- Advertisement -