పవన్ కోసం దేనికైనా రెడీ..

261
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో సినీ హీరోయిన్ మద్దతు పలికింది. గతంలో కత్తి మహేష్ వివాదం సమయంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా పూనమ్ కౌర్ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నచ్చావులే’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మాధవీలత తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపింది.

ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే.. “పవన్ అంటే నాకు ప్రేమ అని గడిచిన పదేళ్లలో ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నా. అలానే నాకు సమాజసేవ అన్నా చాలా ఇష్టం. అందుకే.. నక్షత్ర ఫౌండేషన్ ప్రారంభించా. కానీ.. సపోర్ట్.. ఫండింగ్స్ లేక సర్వీస్ కు బ్రేక్ ఇచ్చా. సమాజసేవ చేయాలన్న ఆశ మాత్రం చావలేదు. పవన్ అంటే నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు.. ఒక వ్యక్తిగా ఆయనే జనసేన స్థాపించినప్పుడు నేను ఎందుకు సపోర్టు చేయకూడదు. పవన్ కోసం నేను దేనికైనా రెడీ”. పవన్ ఆహ్వానిస్తే చేరిపోతానంటూ మాధవీలత పేర్కొన్నారు.

Actress Madhavi Latha Shocking Comments on Pawan

నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాలోనే మంచి మార్కులు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినా.. ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్నాళ్లు గ్యాప్ తర్వాత.. ఆ మధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.. దాదాపు గంటకు పైగా ఉన్న వెబ్ ఇంటర్వ్యూను కళ్లప్పగించి చూసేశారు. చాలామంది సినిమా ఆఫర్లతో పాటు.. బెడ్రూం ఆఫర్లు కూడా ఇచ్చారని.. అందుకే ఛాన్స్ లను వదులుకున్నానంటూ బాంబు పేల్చిన మాధవిలత.. తనలోని ఫైర్ బ్రాండ్ ను ఆవిష్కరించారు. ఇక పలువురు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నా.. ఇలాంటోళ్లకు అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదంటూ తేల్చేశారు.

Actress Madhavi Latha Shocking Comments on Pawan

- Advertisement -