స‌ల్మాన్ ఖాన్ ల‌వ‌ర్ పాడిన సాంగ్ విన్నారా.. !

284
- Advertisement -

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అంటే మ‌నకు గుర్తేచ్చోది కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్. అయితే స‌ల్మాన్ ఖాన్ గ‌త కొద్ది రోజులుగా ఒక అమ్మాయితో ప్రేమలో ప‌డ్డాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ఆమెతోనే ట్రావెల్ చేస్తున్నాడ‌ట స‌ల్మాన్ ఖాన్. రొమెనియ‌న్ భామ లులియా వాంట‌ర్ తో కొన్ని రోజులు నుంచి స‌ల్మాన్ ఖాన్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడ‌ని స‌మాచారం. ఈసంద‌ర్బంగా వీరిద్ద‌రూ ప‌లు ఈవెంట్ల‌కు కూడా హాజ‌ర‌వుతున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నయి. అంతేకాకుండా వీరిద్ద‌రూ త్వ‌ర‌లో వివాహం కూడా చేసుకోనున్న‌ట్లు చెబుతున్నారు.

salman khan race3

అయితే స‌ల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం రేస్ 3. ఈసినిమ‌లో స‌ల్మాన్ ప్రేయ‌సి లులియా వాంటర్ ఓ సాంగ్ ను కూడా పాడ‌టం బాలీవుడ్ లో చ‌ర్చాంశంనీయంగా మారింది. దీంతో విరిద్ద‌రి మ‌ధ్య సంబంధం ఉన్న‌ట్టు క‌న్ఫామ్ అయిపోయింది.ఈ మూవీలో స‌ల్మాన్ స‌ర‌స‌న‌ జాక్వేలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. అనిల్ క‌పూర్, డైసీ షా పలువురు ప్ర‌ముఖులు ఈసినిమాలో కీల‌క పాత్రల్లో న‌టించారు. ఈసినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్ కు చేరుకోగా..రంజాన్ కానుక‌గా జూన్ 15న విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర బృందం.

ప్ర‌తిసారి రంజాన్ కానుక‌గా స‌ల్మాన్ ఖాన్ సినిమా విడుద‌ల అవుతుంది. ఇక అవి బాలీవుడ్ లో బాక్సాఫిస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ ల‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందే సెంటిమెంట్ తో ఈసారి కూడా రేస్ 3 మూవీని రంజాన్ రోజున ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. గ‌త కొద్దిరోజుల నుంచి ఈసినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. స‌ల్మాన్ ప్రేయ‌సి పాడిన పాట ట్రైల‌ర్ ను నిన్న విడుద‌ల చేయ‌గా..నేడు ఫుల్ వీడియో సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈసాంగ్ తో స‌ల్మాన్ లిరిక్ రైట‌ర్ గా కూడా మారిపోయాడు. మొత్తం మీద స‌ల్మాన్ ఖాన్ త‌న ప్రేయ‌సితో త‌ను రాసిన పాట‌ను పాడించి త‌న ల‌వ‌ర్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. రేస్ 3 సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు స‌ల్మాన్ అభిమానులు.

- Advertisement -