పంచావతారాల్లో ‘భరత్‌’..!

233
Salman Khan will be seen in 5 different avatars in 'Bharat'
- Advertisement -

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తాజాగా అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో ‘టైగర్ జిందా హై’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటివల విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే సల్మాన్ తన కొత్త సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ ‘భరత్’ పేరుతో మరో మూవీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. టైగర్ జిందా హై సెట్స్‌పై ఉండగానే కొత్త ప్రాజెక్టును 2019 ఈద్‌కు విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు సల్మాన్.

సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కనీసం ఐదు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో సల్మాన్-జాఫర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలు హిట్ కొట్టాయి. ఇప్పుడు ‘భరత్‌’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు వారిద్దరూ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ప్రస్తుతం ఈ సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందులో సామాన్యుడి పాత్రలోనూ ఈ కండల వీరుడు కనిపించనున్నాడని తెలిసింది.

Salman Khan will be seen in 5 different avatars in 'Bharat'

కథ డిమాండ్ మేరకు పంజాబ్, ముంబై, ఢిల్లీ, స్పెయిన్, అబూదాబీలోని పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరపనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో గత 60 ఏళ్ల చరిత్రను చూపించనున్నారట. అందువల్ల చారిత్రక సంఘటనల కోసం ప్రత్యేక సెట్‌లను కూడా వేయనున్నారని తెలిసింది. దక్షిణకొరియా డ్రామా ‘ఓడ్ టు మై ఫాధర్’కి ఈ సినిమా అధికారిక రీమేక్. ఇందులో ఇండో-పాక్ సరిహద్దు కోసం అబూదాబీలో ఒక ఎడారిని ఏర్పాటు చేయనున్నారట. ఇరవై ఏళ్ల వ్యక్తి పాత్రను కూడా సల్మాన్ పోషించనున్నాడట. దానికి తగ్గట్టుగా కనిపించడం కోసం ఈ సూపర్ స్టార్ ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాడు. మొత్తానికి ఐదు పాత్రలతో ఫ్యాన్స్‌కు సల్మాన్ కనిపించనున్నాడన్నమాట.

- Advertisement -