భరత్ అనే నేను సినిమాతో మళ్లి ఫాం లోకి వచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అంతకు ముందు వచ్చిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో.. అతనికి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించిన కొరటాల శివ తో మళ్లి సినిమా తీసి మరో బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకున్నాడు. భరత్ అనే నేను సినిమాకు ముందు మహేశ్ బాబు చేసిన సినిమా స్పైడర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీ ప్లాప్ ను సొంతం చేసుకుంది. స్పైడర్ మూవీకి తమిళ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.
తెలుగు, తమిళ్ లో ఈసినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే తాజాగా దర్శకుడు మురుగదాస్ ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్పైడర్ చిత్రాన్ని బాలీవుడ్ లో రిమేక్ చేయాలనుకుంటున్నానని తెలిపాడు దర్శకుడు మురుగదాస్. స్పైడర్ హిందీలో రిమేక్ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు ఈవార్త బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో ప్లాప్ గా మారిన ఈ సినిమాను మురుగదాస్ ఎవరితో చేస్తాడొ అనే చర్చ నడుస్తోంది.
మురుగదాస్ తన రిమేక్ చిత్రానికి హీరోగా ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు పాత్రలను కన్ఫామ్ చేశాడు దర్శకుడు. ఇక హీరో పాత్ర మాత్రమే మిగిలి ఉందట. అయితే మహేశ్ పాత్ర కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను సంప్రదించినట్టు సమాచారం. బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కిన స్పడర్ చిత్రంలో తెలుగులో మహేశ్ బాబు హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. ఈచిత్రంలో ముఖ్య పాత్రలో దర్శకుడు, నటుడు ఎస్. జె సూర్య నటించారు. ఇక తెలుగ, తమిళ్ లో భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకున్న స్పైడర్ బాలీవుడ్ లో ఏవిధంగా తెరకెక్కించనున్నారో చూడాలి.