‘సూప‌ర్ డీల‌క్స్’ను పూర్తి చేసిన సమంత..

272
Samantha
- Advertisement -

అక్కినేని వారి ఇంట్లో ప్రస్తుతం సమంత సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదిగిపోతోంది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్దంలో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన స‌మంత మంచి హిట్స్ సాధించింది. ఇప్పటికే రంగస్థలం, మహానటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల అభిమన్యుడు సినిమాతో కూడా మరో మంచి హిట్ అందుకుంది. తెలుగు, తమిళ్‌లో సమంత స్టార్ డమ్ చాలా పెరుగుతోంది.

Samantha

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్‌, మిస్కిన్‌, ర‌మ్య కృష్ణ‌, మిర్నాలిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం సూప‌ర్ డీల‌క్స్‌. థైగ‌రాజ‌న్ కుమార‌రాజా ఫేం ఆర‌ణ్య‌కాందం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స‌మంత పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తైంద‌ట‌. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సమంతతో కేక్ క‌ట్ చేయించి సెండాఫ్ ఇచ్చారు.

ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తుండ‌గా, నిరవ్ షా మ‌రియు వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సినిమా తప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌నే ఆశలో టీం ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ చిత్రం స‌మంత‌కి మ‌రో విజ‌యాన్ని అందించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సమంత. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.

- Advertisement -