లూసిఫర్ రీమేక్‌లో సల్మాన్‌…?

140
salman khan
- Advertisement -

ఆచార్య సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మలయాళ రీమేక్‌ మూవీ లూసిఫర్‌లో నటించనుండగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మలయాళ ఒరిజినల్ వర్షన్‌లో వివేక్ ఒబెరాయ్‌ పోషించిన పాత్ర కోసం తెగ కుస్తీపడుతున్నారు దర్శకుడు రమేష్‌.

తొలుత సత్యదేవ్ ను తీసుకుంటారని ప్రచారం జరిగినా తాజాగా మరో ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి తనకు స్నేహితుడైన సల్మాన్ ఖాన్‌ను ఈ పాత్ర కోసం వ్యక్తిగతంగా సంప్రదించారట. దీనికి సంబంధించి ఆగస్టు 13 లోపు ప్రకటన చేయనున్నారట మేకర్స్. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో భాగం అవుతాడా లేదా అనేది అప్పుడే తెలియనుంది.

- Advertisement -