తండ్రి కాబోతున్న సల్లూభాయ్‌..!

182
- Advertisement -

అవును..బాలీవుడ్ కండలవీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ తండ్రి కాబోతున్నాడు.. అసలు సల్మాన్ ఖాన్ తండ్రి కావడం ఏంటి, పెళ్ళికాకుండా తండ్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే సల్మాన్ ఖాన్ త్వరలో తండ్రి కాబోతున్నాడని సమాచారం.

అది ఎలా అంటే … చాలా మంది బాలీవుడ్ వాళ్ల తరహాలోనే! అదేనండీ.. సరోగసి పద్ధతిలో. అద్దెగర్భం (సరోగసి) పద్ధతిలో తండ్రి అయ్యే ఆలోచనలో సల్మాన్ ఖాన్ ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.. కానీ ఇప్పుడే కాదు దానికి ఇంకా రెండు సంవత్సరాలు తర్వాత సరోగసి పద్ధతిలో తాను తండ్రి కావాలని సల్మాన్ చూస్తున్నాడట.. ఎందుకంటే మన కండల వీరుడికి చేతినిండా సినిమాలు ఉండటంతో ఇంకొంతకాలం ఆగవచ్చని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

Salman Khan may embrace fatherhood soon

‘నేను మంచి భర్తను కాకపోయినా, మంచి త్రండిని అవగలను’ అని సల్మాన్ గతంలో వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా బాలీవుడ్ లో ఇప్పటివరకు సరోగసి పద్ధతిని ఆశ్రయించిన వారిలో బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, దర్శక, నిర్మాత కరణ్ జోహార్ దర్శకురాలు ఫరాఖాన్, నాటి నటుడు జితేంద్ర కుమారుడు తుషార్ కపూర్ ఉన్నారు.. కరణ్ జోహార్ కూడా సరోగసి పద్ధతిలో ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్నాడు.. ఇక ఇదే కోవలోకి సల్మాన్ ఖాన్ కూడా వస్తారా లేదా అనే దానిపై సల్మానే వివరణ ఇవ్వాలిక.

- Advertisement -