సింగర్ రాను మోండాల్ కు సల్మాన్ భారీ ఆఫర్

531
Salman khan Ranu Mondal
- Advertisement -

రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకునే రాణు మండల్ ఇవాళ బాలీవుడ్ సింగర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఆమె పాడిన పాటకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అయ్యారు. ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దాంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ హిమేశ్ రేషమ్మియా తన కొత్త చిత్రంలో ఓ పాట కూడా పాడించాడు.

ఆమెతో కలిసి తానూ పాట పాడుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. రాను మండల్ ఇన్ని రోజుల వదిలేసిన ఆమె కూతురు కూడా దగ్గరికి తీసుకుంది. ఆమె పాడిన పాటకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఫిదా అయిపోయాడు.

దీంతో ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు సల్మాన్. తన మూవీలో ఆమెకు పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. సల్మాన్ ఖాన్ చేస్తున్న దబాంగ్ 3లో పాట పాడే అవకాశం ఇచ్చారట. అంతేకాకుండా రూ.55లక్షల విలువైన ఇంటిని కూడా బహుమతిగా ఇచ్చారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

- Advertisement -