కరోనా..బాలీవుడ్ అగ్రహీరోలు నిజంగా హీరోలే..!

254
salman
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌లు పెద్ద ఎత్తున ముందుకువస్తున్నారు. ఇప్పటికే హీరో అక్షయ్‌ కుమార్‌ ..పీఎంకేర్స్‌కు రూ. 25 కోట్ల విరాళం ఇవ్వగా తాజాగా మరోసారి కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం అందించేందుకు ముందుకువచ్చారు. తొలి విడతగా 25 వేల కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమచేశారు.

మొత్తంగా ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తన వంతుగా రూ. 15 కోట్లు విరాళంగా అందజేసినట్టు ప్రకటించారు. వీరిబాటలోనే అజయ్ దేవ్‌గణ్, వరుణ్ ధావన్,అమితాబ్, హృతిక్,విక్కీ కౌశల్ వంటి నటులు తమ వంతుగా సాయం చేశారు.

- Advertisement -