సల్మాన్‌ బెయిల్‌పై ముగిసిన వాదనలు

223
Salman Khan Blackbuck case: bail order after 1:30 pm?
- Advertisement -

కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రెండోరోజులుగా జైలులోనే ఉన్న సల్మాన్ బెయిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్ బదిలీ నేపథ్యంలో అనిశ్చితి నెలకొనగా ఆయన విధులకు హాజరై బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపారు. తీర్పు మధ్యాహ్నం తర్వాత వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

విచారణలో ఎన్నో లోపాలున్నాయని, ఈ కేసులో సల్మాన్‌ ఆయుధాలు ఉపయోగించినట్లు ఎక్కడా రుజువు కాలేదని వాదించారు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వాదించారు సల్మాన్ న్యాయవాదులు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను విశ్వసించలేమని చెబుతూ, వేటకు సంబంధించిన మిగతా కేసుల్లో సల్మాన్‌ పై అభియోగాలేవీ రుజువు కాలేదని న్యాయస్థానానికి గుర్తుచేశారు. అయితే,సల్మాన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ వాధించింది. తీర్పు మధ్యాహ్నానికి వాయిదా పడటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా పడిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ బెయిల్ తీర్పు ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో రాజస్థాన్‌ హైకోర్టు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్‌ జడ్జి రవీంద్ర కుమార్‌ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -