కండల వీరుడు సల్మాన్ ఖాన్ శనివారం పాము కాటుకు గురయ్యాడు. పాము కాటేసిందనే విషయం తెలిసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఆయనెలా ఉన్నాడో అంటూ కంగారు పడుతున్నారు. గతరాత్రి పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉండగా ఘటన జరినట్లు సమాచారం. దీని తర్వాత నటుడిని అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లగా.. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఉదయం 9 గంటలకు ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చిన భాయ్‌జాన్ ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎలాంటి ఎలాంటి ప్రాణ భయం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు.. క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 27న బర్త్ డే పార్టీ జరుపుకునేందుకు సల్మాన్, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫామ్‌హౌస్‌కి చేరుకున్నాడు. అయితే ఆ ప్రాంతం చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉండడంతో తరచుగా ఈ కాంప్లెక్స్‌లోకి పాములు, కొండచిలువలు వస్తుంటాయి. సరదాగా బయటి ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలియవస్తోంది. కానీ ఆ పాము విషరహితం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ 56వ పుట్టిన రోజుకి రెండు రోజుల ముందు ఇలా జరగడంపై సల్మాన్ ఫ్యాన్స్. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సల్మాన్ ఖాన్ వరస సినిమాలతో పాటు బిగ్ బాస్ షోతో కూడా బిజీగా ఉన్నాడు. ఈయన చేతిలో ఇప్పుడు అరడజన్ సినిమాలున్నాయి. ఈ మధ్యే అంతిమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కండలవీరుడు.