వెంకీ డాటర్‌ పెళ్లిలో సల్మాన్ సందడి..

322
salman venkatesh
- Advertisement -

దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రితతో హైదరాబాద్ రేస్ క్లబ్ కి అధిపతి ఆర్.సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో పెళ్లి జరగనుంది. ఆశ్రీత, వినాయక్ ల ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో.. ఇటీవల ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. రాజస్థాన్ లో పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుండగా దగ్గుబాటి కుటుంబానికి చెందినా అత్యంత సన్నిహితులు, టాలీవుడ్ లోని కొందరు ముఖ్యమైన సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

జైపూర్ లో జరుగుతున్న వివాహ మహోత్సవ వేడుకలకు బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు.ఇక ఈ వేడుకలో రానా,నాగచైతన్య,సమంతలు ధూమ్ ధామ్ చేశారు.

venkatesh daughter marriage

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్,వెంకటేష్ లు మంచి స్నేహితులు. సల్మాన్‌ బాడీగార్డ్ మూవీని తెలుగులో వెంకటేష్ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్, వెంకటేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక అశ్రిత-వినాకయ్‌ల నిశ్చితార్ధం సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకి రానివ్వలేదు. పెళ్లి విషయంలో కూడా అదే చేయబోతున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ నుండి సెలబ్రిటీలు అందరూ హాజరవుతారని తెలుస్తోంది.

- Advertisement -