సూర్యకాంతంతో ట్యాక్సీవాలా..

315
niharika
- Advertisement -

ఒక మనసు చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది మెగా డాటర్‌ నిహారిక. తొలి సినిమాలో తన నటనతో మెప్పించిన నిహా తర్వాత క ‘హ్యాపీ వెడ్డింగ్’తో పర్వాలేదనిపించింది. తాజాగా లాంగ్ గ్యాప్ తీసుకుని సూర్యకాంతంగా ప్రేక్షకుల ముందుకురానుంది. మార్చి 29న సినిమా విడుదల కానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇవాళ హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సూర్యకాంతం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా ట్యాక్సీ వాలా ఫేమ్ విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు.

మెగా డాటర్‌కి జోడీగా స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాగా ప్రణీత్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నారు. . మెమొరబుల్ టైటిల్‌‌తో ఆడియన్స్‌ ఆకట్టుకున్న మెగా డాటర్.. ఫస్ట్ లుక్, టీజర్‌లతో గుడ్ ఇంప్రెషన్ రాబట్టింది. మరి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నిహా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -