సల్లూభాయ్…కుర్ర హీరోలపై కామెంట్‌..!

34
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పుడు వస్తున్న కొత్త తరం హీరోల రెమ్యునరేషన్‌ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేటీతరం హీరోలు భారీగా రెమ్యునరేషన్‌ పెంచుతున్నారని అన్నారు. వారు ఎంతోకష్టపడి పనిచేస్తున్నారని కూడా తెలిపారు. వారికి సినిమాపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. వాళ్ల భవిష్యత్‌ ప్రణాళికలు కూడా బాగున్నాయని అన్నారు.

కానీ ఇదంతా కేవలం డబ్బుల కోసమే చేస్తున్నారని అన్నారు మే ఐదుగురం (సల్మాన్, షారుక్, అమీర్, అక్షయ్, అజయ్‌)సీనియర్ హీరోలమయ్యామని వారు అనుకుంటున్నారు. కానీ మేము అంత త్వరగా ఏ సినిమాలను వదులుకోం. అన్ని రకాల సినిమాలను తీయడానికి ముందుకువస్తామని అన్నారు. అయితే కొంతమంది హీరోలు జయపజయాలతో సంబంధం లేకుండా రేమ్యునరేషన్‌ పెంచేసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ డిబెట్‌గా మారింది. అయితే సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు నటీనటులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్ తాజా చిత్రం కిసీ కా భాయ్ …కిసీ కా జాన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పలు పాటలు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ని తెచ్చుకొగా అందులో తెలంగాణ బతుకమ్మ పాట కూడా ఉంది. ఈ సినిమాలో వెంకటేష్‌ జగపతిబాబు పూజాహెగ్డే షెహనజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

జాన్‌సేనతో ప్రియాంక మూవీ..!

సమ్మర్ కమర్షియల్ మూవీ… మీటర్ : గోపిచంద్

Dasara:దసరా బ్లాక్ బస్టర్ దావత్

- Advertisement -