Tuesday, December 3, 2024
Home టాప్ స్టోరీస్ Salaar Twitter Review:మూవీకి అదే హైలెట్!

Salaar Twitter Review:మూవీకి అదే హైలెట్!

127
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కోసం ఇండియన్ సినీ అభిమానును ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సలార్ మూవీ అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు టిజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. దాంతో మూవీ ఎలా ఉందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మూవీ చూసిన వారు ట్విట్టర్ లో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సలార్ నిలుస్తుందని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ తన మేకింగ్ తో మరోసారి అందరినీ కట్టిపడేశాడని చెబుతున్నారు. .

మూవీలో ఎమోషన్స్, ఎలివేషన్ సింగ్స్, బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్ కొత్తగా ఉంటుందని, మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో ప్రభాస్ కనిపిస్తాడని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్ లో వచ్చే రెండు ఫైట్ సీన్స్ మూవీకే హైలెట్ అని అభిమానులు చెబుతున్నారు. ఇంకా సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయని చెబుతున్నారు. అన్నిటికి ముంది క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరు ఊహించలేరని చెబుతున్నారు. ఓవరాల్ గా మూవీ అద్భుతంగా ఉందని ప్రభాస్ ను చాలా కాలం తరువాత పక్కా మాస్ అవతార్ లో చూడవచ్చని చెబుతున్నారు. దీంతో మూవీ విడుదల అయిన అన్నీ చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. బాహుబలి సిరీస్ తర్వాత వరుసగా ఫ్లాప్స్ చూసిన ప్రభాస్ సలార్ తో మరోసారి బాహుబలి రేంజ్ హిట్ కొట్టడాని చెబుతున్నారు చాలా మంది. మరి లాంగ్ రన్ లో సలార్ ఎంతటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -