Salaar:ప్చ్.. సలార్ ను భరించగలరా?

13
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా వ‌స్తున్న సినిమా స‌లార్. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం స‌లార్ పై ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నిడివి బాగా ఎక్కువ అని టాక్ నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద నిడివి సినిమానైనా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనేది ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. తన మూవీని ఎలాగైనా హిట్ చేస్తారని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం… గత వారం వచ్చిన యానిమల్ సినిమా కూడా భారీ రన్ టైమ్ తో వచ్చినవే. కాబట్టి, సలార్ కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.

కాకపోతే, భారీ రన్ టైమ్ తో వచ్చిన సినిమా హిట్ అవ్వాలి అంటే.. భారీ ఎమోషనల్ డ్రామాగా ఉండాలి. ఓన్లీ యాక్షన్ మూవీగా ఉంటే భారీ నిడివి సినిమాలు హిట్ కావు అని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా భారీ నిడివితో వచ్చే సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. ఎక్కువ నిడివి ఉన్న సినిమాను థియేటర్లలో కూర్చొని చూడడం ఇప్పటి తరం ప్రేక్షకుడి వల్ల అవుతుందా అనేది కూడా పెద్ద డిస్కషన్ పాయింటే. కాకపోతే, కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ ఈ మధ్య రన్ టైమ్ విషయంలో పట్టింపులకు పోవడం లేదనేది మరో టాక్.

అయితే, మరీ ఎక్కువ రన్ టైమ్ అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా సలార్ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. అందుకే, సలార్ సినిమా ఓటీటీ హక్కులు భారీ రేట్ కు అమ్ముడయ్యాయట. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.160 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందట. మొత్తమ్మీద యాక్షన్ అభిమానులకు సలార్ ఫుల్ కిక్ ఇవ్వనున్నాడు. ఇక ‘సలార్ 1’ రిలీజ్ అయిన వెంటనే.. ప్రభాస్ ఈ సినిమా రెండో పార్ట్ షూట్ ను కూడా స్టార్ట్ చేస్తారట. వచ్చే ఏడాది ఎండింగ్ నాటికి ‘సలార్ 2’ షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read:మేమంతా కెసిఆర్ వెంటే..బీఆర్ఎస్‌ ఎన్నారైలు

- Advertisement -